ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు..

ABN, First Publish Date - 2020-09-17T14:24:19+05:30

అల్పపీడన ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో గురువారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ కేంద్రం తాజాగా విడుదల చేసిన బులిటిన్ లో హెచ్చరించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాతావరణశాఖ తాజా హెచ్చరిక

న్యూఢిల్లీ : అల్పపీడన ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో గురువారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ కేంద్రం తాజాగా విడుదల చేసిన బులిటిన్ లో హెచ్చరించింది. దేశంలోని దక్షిణ, సెంట్రల్, తూర్పు ప్రాంతాల్లో గురువారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఒడిశా, కర్ణాటక, కేరళ, అండమాన్ నికోబార్ దీవుల్లో 19,20 వతేదీల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.


అల్పపీడన ప్రభావం వల్ల హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో వచ్చే ఐదురోజులపాటు భారీవర్షాలు కురుస్తాయి.కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెంట్రల్ మహారాష్ట్ర, మరాఠ్వాడ, కర్ణాటకలోని కోస్తా, ఉత్తర ప్రాంతం, కేరళ, మహారాష్ట్రలలో వచ్చే మూడురోజుల పాటు భారీవర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


పిడుగులు పడవచ్చు...

మధ్యప్రదేశ్, విదర్భ, బిహార్, జార్ఖండ్, సెంట్రల్ మహారాష్ట్ర, మరాఠ్వాడ, ఒడిశా, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశముందని కేంద్ర వాతావరణ సంస్థ అధికారులు హెచ్చరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని స్కైమెట్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. 

Updated Date - 2020-09-17T14:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising