వదంతులు వ్యాప్తి చేయొద్దు
ABN, First Publish Date - 2020-06-18T07:29:35+05:30
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల కొవిడ్ రోగులను సరిగ్గా పట్టించుకోకపోవడం...
- వైద్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ, జూన్ 17: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల కొవిడ్ రోగులను సరిగ్గా పట్టించుకోకపోవడం, తమకూ వైరస్ సోకుతుందన్న భయంతో మృతదేహాలను దహనం చేయకపోవడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. హోం క్వారంటైన్‌లో ఉన్న వారి గురించి కూడా వదంతులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల భయాందోళనలను దూరం చేసేందుకు కేంద్ర వైద్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
- కొవిడ్-19 అంటువ్యాధే అయినా భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
- ఐసొలేషన్, క్వారంటైన్‌లో ఉన్న వారి పట్ల సఖ్యతగా ఉండండి. వారి గుర్తింపును గోప్యంగా ఉంచండి
- కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో వైరస్ ఉండదు. వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండదు.
- కొవిడ్ నివారణకు ఫ్రంట్‌లైన్ వర్కర్లు పడుతున్న శ్రమను అభినందించండి. అంతేతప్ప తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు.
Updated Date - 2020-06-18T07:29:35+05:30 IST