ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెప్టెన్ వ్యాఖ్యలు కొట్టేసిన లవ్ అగర్వాల్

ABN, First Publish Date - 2020-04-10T23:10:01+05:30

కరోనా సామూహిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) పై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా సామూహిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) పై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారంనాడు కొట్టివేసింది. దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి దశలో ఇప్పటికైతే లేదని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన పని లేదని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.


శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, స్థానిక, సామూజిక వ్యాప్తి అనేది ప్రస్తుత సమస్య కాదని, కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరుకుంటే తప్పనిసరిగా తెలియజేస్తామని చెప్పారు. గురువారంనాడు 16,602 పరీక్షలు జరిపితే కేవలం 2 శాతం మాత్రమే పాజిటివ్‌గా తేలినట్టు ఆయన తెలిపారు. 'సేకరించిన శాంపుల్స్‌ను బట్టి ఇన్‌ఫెక్షన్ శాతం ఎక్కువగా ఏమీ లేదని గుర్తించాం. శీఘ్ర డయోగ్నస్టిక్ కిట్స్ కూడా మంజూరు చేశాం' అని లవ్ అగర్వాల్ వివరించారు.


దీనికి ముందు, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, తాజాగా వెలుగు చూసిన కేసులను బట్టి రాష్ట్రంలో కరోనా సామూహిక వ్యాప్తి జరిగినట్టు కనిపిస్తోందని, కొత్త కేసుల్లో ఎక్కువమందికి ట్రావెల్ హిస్టరీ కూడా లేదని చెప్పారు.

Updated Date - 2020-04-10T23:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising