ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌సీసీబీలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం

ABN, First Publish Date - 2020-10-09T01:14:54+05:30

దేశంలో అత్యున్నత ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హెచ్‌సీసీబీ, తమ ఉద్యోగుల కోసం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హెచ్‌సీసీబీ, తమ ఉద్యోగుల కోసం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని తీసుకువచ్చింది. మహమ్మారి తరువాత కాలమంతా ఈ విధానం అమలులో ఉంటుందని, ఉద్యోగులు శాశ్వతంగా వర్క్‌–ఫ్రమ్‌ –హోమ్‌ విధానాన్ని ఎంచుకోవచ్చని సూచించింది. అయితే కచ్చితంగా హాజరుకావాల్సిన ఉద్యోగులకు మాత్రం ఇది వర్తించదని తెలిపింది. ఉద్యోగుల భద్రత, వారి మానసిక, శారీరక సంక్షేమం కోసం ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు హెచ్‌సీసీబీ యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా వర్క్‌ ఫ్రం హోమ్‌కు తగినట్లుగా ఆర్థికంగానూ మద్దతు అందించన్నట్లు తెలిపింది. దీనికోసం ఇప్పటికే కుర్చీలను, టేబుళ్లను ఉచితంగా అందిస్తోంది. అలాగే ఇంటర్నెట్‌ ఖర్చులు, యూపీఎస్‌ లేదా పవర్‌ బ్యాకప్‌ సహా నెలవారీ ఖర్చులన్నింటినీ హెచ్‌సీసీబీ అందించనున్నట్లు ప్రకటించింది. 


ఈ పాలసీలో భాగంగా శిక్షణా కార్యక్రమాలు, మద్దతు మెటీరియల్స్‌ను ఉద్యోగులకు అందించనుంది. దీని వల్ల ఉద్యోగులు మరింత ఉత్పాదకతతో పనిచేసేందుకు సహాయపడుతుందని సంస్థ అభిప్రాయపడుతోంది. అంతేకాకుండా హెచ్‌సీసీబీ  ఇప్పుడు లింక్‌డ్‌ఇన్‌ లెర్నింగ్‌, హార్వార్డ్‌ మేనేజ్‌ మెంటార్‌ శిక్షణ కార్యక్రమాలను సైతం అందుబాటులో ఉంచింది.

Updated Date - 2020-10-09T01:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising