ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఎంపీపై జార్ఖండ్ సీఎం పరువునష్టం దావా

ABN, First Publish Date - 2020-10-03T14:15:45+05:30

తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీ కోర్టులో రూ.300 కోట్లకు పరువు నష్టం దావా వేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనపై అత్యాచార ఆరోపణలు చేశారని...

రాంచీ (జార్ఖండ్): తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీ కోర్టులో రూ.300 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. గొడ్డా పార్లమెంటు సభ్యుడు దూబే జులై 27-29 తేదీల మధ్య సీఎం సోరెన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2013లో ముంబై దిగువ కోర్టులోతనపై ఓ మహిళ దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసు గురించి తనకు తెలియదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కోర్టుకు తెలిపారు. 


సోరెన్ తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును పరిష్కరించడానికి తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ దూబే ఆరోపించారు. సీఎంపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని, దీనిపై ముంబై పోలీసులు తిరిగి దర్యాప్తు చేయాలని ఎంపీ దూబే జులై 29న ట్వీట్ చేశారు.ఎంపీ దూబేతో కలిసి ముగ్గురిపై రూ.300 కోట్లకు సీం సోరెన్ పరువునష్టం దావా వేశారు.

Updated Date - 2020-10-03T14:15:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising