ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్రాస్ బాధిత కుటుంబానికి ఇళ్లు, ఉద్యోగం, 25 లక్షలు: యోగి

ABN, First Publish Date - 2020-10-01T01:20:32+05:30

దీనిపై ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశాం. ఏడు రోజుల్లో సిట్ రిపోర్ట్ వస్తుంది. వీలైనంత తొందరలో న్యాయం జరిగేట్టు చూస్తాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరిపిస్తాం’’ అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: హత్రాస్‌ బాధితురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయలు, ఒక ఇళ్లు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ బుధవారం ప్రకటించారు. అంతే కాకుండా కేసును వెంటనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దర్యాప్తుకు సంబంధించిన రిపోర్టును వారంలోగా ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. ‘‘హత్రాస్ దారుణంలోని నేరస్తులు ఎవరూ తప్పించుకోకూడదు. దీనిపై ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశాం. ఏడు రోజుల్లో సిట్ రిపోర్ట్ వస్తుంది. వీలైనంత తొందరలో న్యాయం జరిగేట్టు చూస్తాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరిపిస్తాం’’ అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.


రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం పని చేస్తుందట. మిగతా ఇద్దరు వ్యక్తులు అడిషనల్ డైరెక్టర్ జనరల్ చంద్ర ప్రకాష్ కాగా ఆగ్రాలోని పోలీసు ఆర్మ్‌డ్ కనిస్టాబులరీ కమాండ్ పూనమ్. వీరు ముగ్గురూ కలిసి హత్రాస్ కేసును దర్యాప్తు చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు త్వరితగతిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. హత్రాస్ విషయమై తనకు ఫోన్ చేసిన మోదీ నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆదేశించినట్లు యోగి పేర్కొన్నారు.

Updated Date - 2020-10-01T01:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising