ఢిల్లీలో జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు అనుమతి
ABN, First Publish Date - 2020-09-14T16:40:13+05:30
దేశ రాజధాని నగరం ఢిల్లీలో సోమవారం నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరుచుకోనున్నాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో సోమవారం నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరుచుకోనున్నాయి. సెప్టెంబర్ 30 వరకు వారాంతపు సంతలకు కూడా అనుమతులు ఇచ్చారు. అన్ లాక్ 4.O నిబంధనల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరుచుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఇవాల్టి నుంచి వ్యాయామశాలలు తెరుచుకుంటాయి. అయితే కట్టడి ప్రాంతాల్లో ఉన్న జిమ్‌లు, యోగా సెంటర్లను మాత్రం మూసే ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Updated Date - 2020-09-14T16:40:13+05:30 IST