ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికరణ 370 పునరుద్ధరణకు జమ్మూ-కశ్మీరు పార్టీల ప్రతిన

ABN, First Publish Date - 2020-08-23T02:49:15+05:30

జమ్మూ-కశ్మీరులో గత ఏడాది ఆగస్టు 5కు పూర్వపు స్థితిని పునరుద్దరించేందుకు గట్టిగా కృషి చేస్తామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులో గత ఏడాది ఆగస్టు 5కు పూర్వపు స్థితిని పునరుద్దరించేందుకు గట్టిగా కృషి చేస్తామని 6 రాజకీయ పార్టీలు ప్రతినబూనాయి. ‘‘జమ్మూ-కశ్మీరులో మేం లేకుండా, మా గురించి ఏమీ ఉండదు’’ అని స్పష్టం చేశాయి. కసితో కూడిన హ్రస్వ దృష్టితో జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశారని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నాయి. 


అంతకుముందు, శనివారం సామాజిక మాధ్యమాల్లో ‘గుప్కర్ డిక్లరేషన్-2’ అంటూ ఓ తీర్మానం చలామణీ అయింది. దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, జమ్మూ-కశ్మీరు కాంగ్రెస్ చీఫ్ జీఏ మిర్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోన్, సీపీఎం నేత ఎంవై తరిగామి, జమ్మూ-కశ్మీరు అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ముజఫర్ షా సంతకాలు చేశారు. 


2019 ఆగస్టు 4న ‘గుప్కర్ డిక్లరేషన్-1’పై సంతకాలు చేసిన నేతలు పరస్పరం సంబంధాలు ఏర్పరచుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. వీరంతా ఫరూఖ్ అబ్దుల్లా నివాసం ‘గుప్కర్’లో సమావేశమయ్యారు. కానీ ప్రభుత్వం ఆ మర్నాడే అధికరణ 370ని రద్దు చేసింది. 




Updated Date - 2020-08-23T02:49:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising