ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19 ఎఫెక్ట్: అమెరికాలో తుపాకుల కోసం క్యూ..!

ABN, First Publish Date - 2020-04-04T17:25:42+05:30

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ వల్ల అమెరికాలో 6700 మంది మరణించగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ వల్ల అమెరికాలో 7000 మందికి పైగా మరణించగా.. కోవిడ్-19 భయాందోళపై అక్కడి పరిస్థితికి అద్దం పట్టేలా ఇప్పడు మరో వార్త వెలుగులోకి వచ్చింది. గత నెలలో అమెరికన్లు రికార్డు స్థాయిలో తుపాకులను కొనుగోలు చేసినట్టు తేలింది. ప్రభుత్వం వద్ద ఉన్న తాజా గణాంకాల ప్రకారం మార్చిలో మొత్తం 37 లక్షల మంది ప్రజలు గన్‌లైసెన్సుల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి అని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఇప్పటికే 24 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తైంది. మార్చి 16 నుంచి కేవలం ఒక్క వారంలోనే 12 లక్షల దరఖాస్తులను పరిశీలించినట్టు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) వెల్లడించింది. అందునా మార్చి 20న ఒక్కరోజులో 2.10 లక్షలకు పైగా దరఖాస్తులు పరిశీలించామనీ.. ఇది గత రికార్డులన్నిటీనీ బ్రేక్ చేసిందని ఎఫ్‌బీఐ పేర్కొంది.


అమెరికా రాజ్యాంగంలోని రెండవ సవరణ చట్టం ప్రకారం ఆత్మ రక్షణ హక్కుల్లో భాగంగా తుపాకులను అత్యవసర సేవగా భావిస్తారు. తుపాకుల కొనుగోలు కోసం ఎఫ్‌బీఐ తనిఖీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జాతీయ తక్షణ క్రిమినల్ నేపథ్య తనిఖీ వ్యవస్థ ద్వారా ఎఫ్‌బీఐ ఈ దరఖాస్తులను పరిశీలిస్తుంది. కాగా ఎఫ్‌బీఐ‌ నుంచి కేవలం ఒక్క తనిఖీతో లైసెన్స్‌డ్ గన్ డీలర్ నుంచి అమెరికన్లు చాలా తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎఫ్‌బీఐ తనిఖీల ద్వారా ఎన్ని తుపాలకులు అమ్ముడయ్యా యన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా తుపాకులు, మందుగుండు సామగ్రి అమ్మకాలు భారీగా పెరిగడం గమనార్హం. అమెరికాలో ఇప్పటి వరకు 2.7 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా... 7 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.  

Updated Date - 2020-04-04T17:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising