ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బరేలీలో ఐపీఎస్‌పై దాడి.. ఎనిమిది మంది అరెస్ట్

ABN, First Publish Date - 2020-04-07T22:50:07+05:30

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర విధించిన లాక్‌డౌన్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లో బరేలీలో అమలు చేసేందుకు వెళ్లిన పోలీసులపై మూకదాడి జరిగింది. ఈ కేసుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బరేలీలో: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర విధించిన లాక్‌డౌన్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లో బరేలీలో అమలు చేసేందుకు వెళ్లిన పోలీసులపై మూకదాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. 


ఇజ్జత్‌నగర్‌లోని కారంపూర్ చౌదరీ అనే ప్రాంతానికి తొలుత పోలీసులు లాక్‌డౌన్ అమలు చేసేందుకు వెళ్లారని సీటీ ఎస్‌పీ రవీంద్ర సింగ్ తెలిపారు. ఫోర్స్‌తో కలిసి అక్కడకు వెళ్లిన ఐపీఎస్‌తో పాటు మిగితా వారిపై కొందరు దాడికి తెగబడ్డారని.. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని పేర్కొన్నారు. ఈ దాడిలో ఐపీఎస్ అభిషేక్ వర్మకు గాయాలయ్యాయని అన్నారు. అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని తెలిపారు.


ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పిన పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-04-07T22:50:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising