ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బారాముల్లా ఎన్‌కౌంటర్‌లో అమరుడైన గ్రెనేడియర్‌కు జన నివాళి

ABN, First Publish Date - 2020-08-21T03:21:40+05:30

లక్నో: ఈ నెల 17న జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా క్రీరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన సీఆర్‌పీఎఫ్ గ్రెనేడియర్ రవికుమార్‌ సింగ్‌కు వేలాది మంది నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఈ నెల 17న జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా క్రీరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన సీఆర్‌పీఎఫ్ గ్రెనేడియర్ రవికుమార్‌ సింగ్‌కు వేలాది మంది నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్‌ మిర్జాపూర్‌కు ఆయన అస్థికలు చేరుకుంటాయనే సమాచారంతో వేలాది మంది మిర్జాపూర్‌కు తరలివచ్చారు. రోడ్లకు ఇరువైపులా జాతీయ పతాకాలు చేతిలో పట్టుకుని నినాదాలు చేశారు. అస్థికలు ఉంచిన వాహనం వెంట గౌర గ్రామం వరకూ నడిచారు. రవికుమార్ త్యాగాన్ని స్మరించుకున్నారు. 



ఈ నెల 17న క్రీరిలో ఉగ్రవాదులు చెక్‌ పాయింట్ వద్ద కాల్పులు జరిపి పారిపోతుండగా గ్రెనేడియర్ రవి, గ్రెనేడియర్ ప్రశాంత్ వెంటాడారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడినా వెనకడుగు వేయలేదు. చివర దాకా పోరాడారు. నాటి ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల్లో లష్కర్ ఎ తొయిబా టాప్ కమాండర్ సజ్జాద్ కూడా ఉన్నాడు. 


26 సంవత్సరాల రవికుమార్‌ సింగ్‌ 2013 జూన్‌లో సైన్యంలో చేరాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. 

Updated Date - 2020-08-21T03:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising