ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటి ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా ఉంది: గడ్కరీ

ABN, First Publish Date - 2020-07-13T20:04:37+05:30

ఇప్పటి ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉన్నా మనకు అత్యంత అనుకూలంగా చైనాకు ప్రతికూలంగా ఉంది. ప్రపంచ దేశాలు చైనా కంటే ఇండియాపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇండియాకి ఎక్కువ పెట్టుబడులు రావడానికి ఇది అద్భుత అవకాశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అత్యంత అనుకూలంగా ఉందని, ప్రపంచం ఇప్పుడు చైనా కంటే ఇండియా వైపే చూస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి తాము సంసిద్ధులమై ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘ఇప్పటి ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉన్నా మనకు అత్యంత అనుకూలంగా చైనాకు ప్రతికూలంగా ఉంది. ప్రపంచ దేశాలు చైనా కంటే ఇండియాపైనే ఆసక్తి చూపుతున్నాయి. ఇండియాకి ఎక్కువ పెట్టుబడులు రావడానికి ఇది అద్భుత అవకాశం. ఈ అవకాశాన్ని మేము అన్ని విధాల సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమయ్యాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది అనుకోకుండా వచ్చిన అవకాశం. మరింత పోటీతత్వంతో మరింత నాణ్యతతో ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటాం’’ అని గడ్కరీ అన్నారు.

Updated Date - 2020-07-13T20:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising