ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రానికి మిడతల బెడద లేదు: మంత్రి వెల్లడి

ABN, First Publish Date - 2020-06-01T15:03:47+05:30

రాష్ట్రానికి మిడతల బెడద ఉండదని, రైతులు నిశ్చింతగా వుండొచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆర్‌.కామరాజ్‌ పేర్కొన్నారు. తిరువారూర్‌లో ఆయన పలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాష్ట్రానికి మిడతల బెడద ఉండదని, రైతులు నిశ్చింతగా వుండొచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆర్‌.కామరాజ్‌ పేర్కొన్నారు. తిరువారూర్‌లో ఆయన  పలు ప్రాంతాల్లో ఉన్న రేషన్‌ దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అన్ని కుటుంబకార్డులకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించిన విధంగా రేషన్‌ సరుకులను ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. రేషన్‌ దుకాణాల వద్ద భౌతిక దూరాన్ని పాటిస్తూ. తేది ప్రకారం టోకెన్లు ఉన్న వారికి సరుకుల వినియోగం ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో రాష్ట్రానికి మిడతల బెడద వుంటుందని కథనాలు వస్తున్నాయని, ముఖ్యంగా రైతులు ఇలాంటి వదంతులకు ఆందోళన చెందరాదన్నారు. మిడతల దండు రాష్ట్రంలో ప్రవేశించే ఛాయలు లేవని, అయినా పనిగట్టుకొని అసత్య వార్తలు ప్రచారం చేయడం సరికాదని మంత్రి సూచించారు.

Updated Date - 2020-06-01T15:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising