దేవాలయాల నిర్వహణకు నిధులు: ఉద్ధవ్ థాకరే
ABN, First Publish Date - 2020-12-16T01:48:53+05:30
కరోనా లాక్‌డౌన్ అనంతరం.. దేశవ్యాప్తంగా దేవాలయాలు తెరుచుకున్నప్పటికీ మహారాష్ట్రలో దేవాలయాలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హిందుత్వాన్ని
ముంబై: మహారాష్ట్రలోని దేవాలయాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. వాటి నిర్వహణకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం కేటాయిస్తుందని ఆయన అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఎగువ సభలో ఆయన మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో ఉన్న దేవాలయాల పరిరక్షణ, నిర్వహణ ప్రభుత్వమే చూసుకుంటుంది. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. దీని కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం. మా హిందూత్వంపై అనుమానాలు వ్యక్తం చేసేవారు (బీజేపీ) ఇప్పుడు ఏమంటారు?’’ అని అన్నారు.
కరోనా లాక్‌డౌన్ అనంతరం.. దేశవ్యాప్తంగా దేవాలయాలు తెరుచుకున్నప్పటికీ మహారాష్ట్రలో దేవాలయాలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హిందుత్వాన్ని వదిలేశారా అని బీజేపీ నేతలు ట్రోల్స్ చేశారు. ఒకానొక సందర్భంలో మహారాష్ట్ర గవర్నర్ రాసిన లేఖ మరింత వివాదాస్పదంగా మారింది. ఉద్ధవ్ సెక్యూలర్ అయ్యారా అంటూ మహా గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో ఉద్ధవ్ నిప్పులు చెరిగారు.
Updated Date - 2020-12-16T01:48:53+05:30 IST