చైనీయులను భారత్‌కు రానివ్వద్దు!
ABN, First Publish Date - 2020-12-29T09:11:10+05:30
భారత్‌కు వచ్చే చైనీయులను విమానాలను ఎక్కనివ్వద్దంటూ విమానయాన సంస్థలకు పౌరవిమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసిందా? అవుననే తమకు సమాచారం ఉందని ఒక జాతీయ టీవీ చానెల్ కథనాన్ని
విమానయాన సంస్థలకు ప్రభుత్వ ఆదేశాలు?
న్యూఢిల్లీ, డిసెంబరు 28: భారత్‌కు వచ్చే చైనీయులను విమానాలను ఎక్కనివ్వద్దంటూ విమానయాన సంస్థలకు పౌరవిమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసిందా? అవుననే తమకు సమాచారం ఉందని ఒక జాతీయ టీవీ చానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. చైనా నుంచి విమానాల రాకపోకల్ని భారత్ నిషేధించినా, ‘ఎయిర్ బబుల్’ ఒప్పందం ఆధారంగా చైనీయులు భారత్‌లోకి రావచ్చు. ఆ ఒప్పందం ప్రకారం 22 దేశాల పౌరులు భారత్‌లో ప్రయాణించవచ్చు. భారతీయులకు అనుమతి నిషేధిస్తున్నట్లు చైనా గత నెల 5న ప్రకటించింది. 39మంది భారతీయులు ఉన్న రెండు కార్గో నౌకలను తమ రేవులో చైనా నెలల తరబడి నిలిపేసింది. అందుకు ప్రతీకార చర్యగానే భారత్ తాజా నిర్ణయం తీసుకుందని సదరు చానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. అయితే, చైనీయులను దేశంలోకి రాకుండా తాము ఏ ఆదేశాలూ ఇవ్వలేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు.
Updated Date - 2020-12-29T09:11:10+05:30 IST