ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిర్ధారణ పరీక్షలపై కేంద్రం గుడ్‌ న్యూస్‌

ABN, First Publish Date - 2020-03-26T01:05:58+05:30

కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజుల పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రం మరో నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ సంబంధిత ల్యాబ్‌లలో కరోనాకు సంబంధించిన పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. అయితే ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షలు మాత్రం పూర్తిగా ఉచితమని చెప్పిన ఆయన ప్రైవేటు ల్యాబ్‌లలో మాత్రం నిర్ధిష్ట ధరని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. 


కరోనా నిర్ధారణ పరీక్షల కోసం నూతనంగా 118 ప్రభుత్వ ల్యాబ్‌లు, 29 ప్రైవేటు ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అత్యవసర సేవలకు సంబంధించిన విభాగాలు మినహా మిగితా ప్రభుత్వ కార్యాలయాలన్ని కూడా మూసివేస్తున్నట్లు తెలిపారు. 


ప్రజలు ఇళ్ల బయటకు వచ్చే పరిస్థితి లేని కారణంగా ఈ-కామర్స్, మరియు డెలియరి సేవలకు మద్దతు ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. అయితే హైడ్రో క్లోరోక్విన్‌ అనే డ్రగ్ వాడటం ద్వారా కరోనా వ్యాధిని నివారించవచ్చని వచ్చిన వదంతులను నమ్మవద్దని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-03-26T01:05:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising