ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్ డౌన్ తో 102 నగరాల్లో శుభ సందేశం

ABN, First Publish Date - 2020-03-26T15:05:27+05:30

దేశంలోని 102 నగరాల్లో గాలి నాణ్యత మరింతగా పెరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకున్న జాగ్రత్తల కారణంగా దేశంలోని పలు నగరాల్లో గాలి ఇంత పరిశుభ్రంగా ఉండటం ఇదే మొదటిసారి. బుధవారం ఢిల్లీలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశంలోని 102 నగరాల్లో గాలి నాణ్యత మరింతగా పెరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకున్న జాగ్రత్తల కారణంగా దేశంలోని పలు నగరాల్లో గాలి ఇంత  పరిశుభ్రంగా ఉండటం ఇదే మొదటిసారి. బుధవారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచికలో 77 పాయింట్ల వద్ద సంతృప్తికర విభాగంలో ఉంది. కరోనా వైరస్ సంక్రమణను నివారించడానికి దేశంలోని అన్ని ప్రాంతాలలో రవాణా వ్యవస్థను నిలిపివేశారు. దేశంలో 21 రోజులు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో  రోడ్లపై వాహనాల తాకిడి తగ్గింది. ఫలితంగా వాతావరణంలో పీఎం 2.5 కాలుష్య కణాలు, నత్రజని ఆక్సైడ్ ల వల్ల కలిగే కాలుష్యం గణనీయంగా తగ్గింది. ముంబై, పూణే, అహ్మదాబాద్, ఢిల్లీలో కాలుష్య తగ్గింపు కోసం పనిచేస్తున్న సంస్థ  సఫర్  తన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం బుధవారం దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి చాలా శుభ్రంగా ఉన్నట్లు తేలింది. దేశంలోని 104 నగరాలకు సంబంధించి  ప్రతి రోజు వాయు నాణ్యత బులెటిన్‌లను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) విడుదల చేస్తుంది.

Updated Date - 2020-03-26T15:05:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising