ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19పై ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ నుంచి శుభవార్త

ABN, First Publish Date - 2020-04-03T21:15:53+05:30

ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో గత 48 గంటల్లో కోవిడ్-19 కేసులు కొత్తగా నమోదు కాలేదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో గత 48 గంటల్లో కోవిడ్-19 కేసులు కొత్తగా నమోదు కాలేదని జిల్లా కలెక్టర్ సుహాస్ శుక్రవారం తెలిపారు. ఇప్పటి వరకు 48  కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, రెండు రోజుల నుంచి కనీసం ఒక కొత్త కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. ఆరుగురికి నయంకాగా, వారిని ఆసుపత్రి నుంచి పంపించినట్లు తెలిపారు. 


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 2,301కి చేరాయి. 156 మందికి నయమైంది, 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 


ఇదిలావుండగా, ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వివిధ ఆసుపత్రుల్లో చేరిన ఢిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ సభ్యులు ఆ ఆసుపత్రిలోని నర్సులపై అక్రమంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిందితులపై జాతీయ భద్రత చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 


జమాత్ సభ్యులను కరోనా వైరస్ చెక్ అప్ కోసం వివిధ ఆసుపత్రులకు తరలించిన సంగతి తెలిసిందే. పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఆసుపత్రి, నర్సింగ్ సిబ్బందితో ఈ జమాత్ సభ్యులు  దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2020-04-03T21:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising