ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిమ్లా పర్యాటకులకు శుభవార్త

ABN, First Publish Date - 2020-10-21T13:29:00+05:30

సిమ్లా పర్యాటకులకు శుభవార్త...హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా ప్రాంతాలను ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్కా-సిమ్లా రైలు సర్వీసుల పునరుద్ధరణ నేటి నుంచి 

న్యూఢిల్లీ : సిమ్లా పర్యాటకులకు శుభవార్త...హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా ప్రాంతాలను సందర్శించాలనుకునే పర్యాటకులకు రైల్వేశాఖ బుధవారం శుభవార్త వెల్లడించింది. కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ సర్వీసును బుధవారం నుంచి భారతీయ రైల్వేశాఖ పునరుద్ధరించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గడచిన 7 నెలలుగా కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ సర్వీసును నిలిపి వేశారు. హిమాలయన్ క్వీన్ గా పిలిచే కల్కా- సిమ్లా టాయ్ ట్రైన్ సర్వీసును 7 నెలల తర్వాత నడిపేందుకు పచ్చజెండా ఊపారు.పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని కల్కా-సిమ్లా  రైలుసర్వీసును నడిపేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


కల్కాలో ఈ  రైలు 12.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు సిమ్లాకు చేరుకుంటుంది. రెండోరోజు ఉదయం 10.40 గంటలకు సిమ్లాలో బయలుదేరి కల్కాకు 4.10 గంటలకు చేరుతుంది. ఏడు బోగీలున్న ఈ రైలు 10 స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు చెప్పారు.ఈ రైలులో రెండు లగ్జరీ బోగీలు కూడా ఉన్నాయి. అంబాలా డివిజనులోని 96 కిలోమీటర్ల దూరంలోని ఈ రైలు మార్గంలో 880 బ్రిడ్జీలు, 100 టన్నెల్సు ఉన్నాయి. ఈ రైలు ప్రయాణం ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తోంది.

Updated Date - 2020-10-21T13:29:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising