ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్పీ నేత హత్య ... 11 మంది అరెస్ట్

ABN, First Publish Date - 2020-04-04T12:59:18+05:30

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది, ఇది ఏప్రిల్ 14 వరకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోండా:కరోనా వైరస్ ను  ఎదుర్కొనేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది, ఇది ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో యూపీలోని గోండా జిల్లాలో కలకలం రేపే సంఘటన చోటుచేసుకుంది. దీనితో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఉదంతంలో  జోక్యం చేసుకోవలసి వచ్చింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోండాలో జరిగిన కాల్పుల్లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేతతో సహా ఇద్దరు మృతి చెందారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులతో సహా 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనలో గాయపడినవారికి సరైన చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎస్పీ నేత లాతి సింగ్‌ను కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో ఎస్పీ నాయకుడితో సహా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఇది పాత కక్షల కారణంగా జరిగిందని తెలుస్తోంది. 



Updated Date - 2020-04-04T12:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising