ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా వస్తువులకు గుడ్ బై చెప్పండి: మనోహర్‌లాల్ ఖట్టర్

ABN, First Publish Date - 2020-06-07T00:05:43+05:30

కరోనా వైరస్ నేపథ్యంలో చైనాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో చైనాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ఇక నుంచి చైనా వస్తువులకు బై బై చెప్పేసి ‘మేడిన్ ఇండియా’ వస్తువులనే వాడాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’‌ పిలుపు.. దిగుమతి వస్తువులపై తక్కువ ఆధారపడాలని, ప్రపంచానికి భారత్ అధిక ఉత్పత్తులు అందించాలని సూచిస్తుందని ఖట్టర్ పేర్కొన్నారు.


‘పోస్ట్ కరోనా: సెల్ఫ్ రెలియంట్ ఇండియా’ అంశంపై కురుక్షేత్ర యూనివర్సిటీ నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన గ్రామం, మన మండలం, మన రాష్ట్రం, మన దేశంలో ఉత్పత్తి అయిన చిన్న, పెద్ద వస్తువులనే వాడాలని నొక్కి చెప్పారు.


చైనా వస్తువులను విడిచిపెట్టాలని కోరిన ముఖ్యమంత్రి ఖట్టర్.. చైనా వస్తువులపై ఆకర్షణ వదులుకోవాలన్నారు. కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందని, దానిని అది నియంత్రించి ఉంటే ఈ రోజు ఇది ప్రపంచ మహమ్మారిగా మారి ఉండేది కాదని ఖట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-07T00:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising