50 మంది కంటే ఎక్కువ గుమిగూడటంపై బ్యాన్ విధించిన కేజ్రీ సర్కార్
ABN, First Publish Date - 2020-03-16T20:53:48+05:30
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కోరలు చాచడంతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. ఢిల్లీలోని
న్యూఢిల్లీ : కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కోరలు చాచడంతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. ఢిల్లీలోని క్లబ్బులు, జిమ్‌తో పాటు స్పాలు మార్చి 31 వరకు మూసి ఉంచాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. అంతేకాకుండా పెళ్లిళ్లు, ఇతరత్రా శుభ కార్యాలను 31 వరకు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు రాజకీయ, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలపై కూడా నిషేధం విధిస్తున్నామని, ఒకే చోట 50 మంది కంటే ఎక్కువ గుమిగూడటంపై కూడా నిషేధం విధిస్తున్నామని ఆయన ప్రకటించారు.
ఆటో రిక్షాల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మెట్రో స్టేషన్లలో థర్మల్ స్ర్కీనింగ్ చేయాలన్న యోచనలో ఉన్నట్లు ఆయన వివరించారు. ఒకవేళ కరోనా వైరస్ సోకిన వారిని క్వారంటైన్ కోసం లెమన్ ట్రీ, రెడ్ ఫాక్స్, ఐబీఐఎస్ హోటళ్లలో అన్ని ఏర్పాటు చేశామని, ఆసుపత్రుల్లో కూడా అన్ని వసతులను సమకూర్చినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Updated Date - 2020-03-16T20:53:48+05:30 IST