ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేలో తగ్గించారు.. జూన్‌లో పెంచారు.. ఎందుకంటే..

ABN, First Publish Date - 2020-06-05T02:21:54+05:30

దేశ ప్రజలకు చమురు సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. వంటగ్యాస్ ధరలను పెంచేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశ ప్రజలకు చమురు సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. వంటగ్యాస్ ధరలను పెంచేశాయి. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరల ప్రభావం వల్ల జూన్ 1నుంచి  భారతదేశంలో కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.100లకు పైగా పెరిగింది. 


దీంతో గ్యాస్ వినియోగారులపై ఆ ప్రభావం పడనుంది. సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పదకొండున్నర పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ.593కు చేరింది. అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.110లు పెరిగింది. దీంతో సిలిండర్ ధర 1139కి పెరిగింది. ఈ పెరుగుదలకు ముందు అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు తగ్గడంతో మే నెలలో ప్రపంచ ధరల కారణంగా ధరలు మూడు నెలలు తగ్గించారు. గత నెలలో వంట గ్యాస్ ధర రూ.744 నుంచి రూ.581కు తగ్గించారు. 


అదే జూన్‌కు వచ్చే సరికి అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగాయని, అందువల్ల తామూ పెంచాల్సి వచ్చిందని, గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. ఇండియన్ ఆయిల్ వెబ్ సైట్ ప్రకారం  ఈ పెంపు ఉజ్వల యోజన లబ్దిదారులకు వర్తించదని ఇండియన్ గ్యాస్ కంపెనీ తెలిపింది. ఎందుకంటే వారు ప్రధానమంత్రి గరీభ్ కల్యాణ్ యోచన పరిధిలో ఉన్నారు కాబట్టి. జూన్ వరకు ఉచిత సిలిండర్ అర్హులని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. 

Updated Date - 2020-06-05T02:21:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising