ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఫ్రీ ఫైర్’ ఆడిన విద్యార్థి.. అకౌంట్‌ నుండి రూ. 90 వేలు మాయం..

ABN, First Publish Date - 2020-09-19T17:38:55+05:30

సాయల్‌కుడి సమీపంలో ఓ విద్యార్థి ఆన్‌లైన్‌లో ఫ్రీ ఫైర్‌ గేమ్‌ ఆడి అతని తల్లిదండ్రుల బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.90 వేలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. రామనాథపురం జిల్లా సాయల్‌కుడి సమీపం మేల్‌కిడారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : సాయల్‌కుడి సమీపంలో ఓ విద్యార్థి ఆన్‌లైన్‌లో ఫ్రీ ఫైర్‌ గేమ్‌ ఆడి అతని తల్లిదండ్రుల బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.90 వేలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. రామనాథపురం జిల్లా సాయల్‌కుడి సమీపం మేల్‌కిడారం గ్రామానికి చెందిన సెంథిల్‌కుమార్‌ కుమారుడు హృతిక్‌రోషన్‌ (12) ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసయ్యాడు. తన తల్లి బ్యాంక్‌ ఖాతాను వినియోగించి సెల్‌ఫోన్‌లో ఈ గేమ్‌ను బాలుడు ఆడేవాడు. ఈ నేపథ్యంలో, రెండు రోజుల క్రితం సెంథిల్‌కుమార్‌ బ్యాంకుకు వెళ్లి తన ఖాతా పరిశీలించుకోవడంతో, తమ ఖాతా నుంచి రూ.90 వేలు విత్‌డ్రా అయినట్లు గుర్తించారు. దీనిపై బ్యాంకు అధికారులు వివరణ ఇస్తూ ప్లే స్టోర్‌లో ఫ్రీ పైర్‌ గేమ్‌ ఆడారని, అందుకోసం నగదు కట్‌ అయిందని తెలిపారు. అందుకు సంబంధించి తన సెల్‌ఫోన్‌లో బ్యాంకు మెసేజ్‌ లేకపోవడంతో సెంథిల్‌ ఇంటికి వెళ్లి కుమారుడిని ప్రశ్నించగా, జరిగిన విషయం బయటపడింది. నగదు కట్‌ అయినట్టు సెల్‌ఫోన్‌లో వచ్చే మెసేజ్‌లను హృతిక్‌ తొలగించేవాడని తేలింది.

Updated Date - 2020-09-19T17:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising