ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాఖండ్‌కు కొత్త రాజధాని

ABN, First Publish Date - 2020-06-08T22:52:56+05:30

వాస్తవానికి ఈ రాజధాని అంశంపై ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, రాష్ట్రా అసెంబ్లీలోనే ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మార్చి 4న విధాన సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రడూన్: ఛమోలి జిల్లాలో ఉన్న గైర్‌సైణ్‌(భరరైసేన్)ను ఉత్తరాఖండ్‌కు వేసవి రాజధానిగా స్థానిక ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. వాస్తవానికి ఈ రాజధాని అంశంపై ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, రాష్ట్రా అసెంబ్లీలోనే ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మార్చి 4న విధాన సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.


‘‘భరరైసేన్(గైర్‌సైణ్)ను ఉత్తరాఖండ్ రాష్ట్ర వేసవి రాజధానిగా ప్రకటించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు’’ అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ విధాన సభ సమావేశాలు సైతం జరుగుతుంటాయి.


ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000 నవంబర్ 9న ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇది ఏర్పడింది. ఈ రాష్ట్రాన్ని హిల్స్ స్టేట్ అని పిలుస్తుంటారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గైర్‌సైణ్‌పై అనేక డిమాండ్లు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ ఆ విషయమై దృష్టి సారించలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన విఎన్ దీక్షిత్ కమిషన్ నివేదికను కూడా పరిగణించలేదని ఐఎఎన్ఎస్ నివేదించింది.

Updated Date - 2020-06-08T22:52:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising