ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీ7 సమావేశాలను వాయిదా వేస్తానన్న ట్రంప్!

ABN, First Publish Date - 2020-05-31T15:56:18+05:30

జూన్ నెలలో జరగనున్న జీ7 దేశాల సమావేశాలను వాయిదా వేస్తానని ట్రంప్ శనివారం ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: జూన్ నెలలో జరగనున్న జీ7 దేశాల సమావేశాలను వాయిదా వేస్తానని ట్రంప్ శనివారం ప్రకటించారు. ఇతర దేశాలు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతమున్న ప్రపంచానికి జీ7 దేశాలూ పూర్తిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని నేను అనుకోవట్లేదు. ఇదో కాలంచెల్లిన బృందం. అని విలేకరులతో ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి.. భారత్, రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలకు ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆహ్వానిస్తానని ఆయన అన్నారు. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల ముందుగానీ, లేక తరువాత గానీ జీ7 సమావేశం జరగొచ్చని తెలిపారు. జీ7 సమేశాలల్లో అత్యంత అభిృవద్ధి చెందిన బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలు పాల్గొంటాయన్న విషయం తెలిసిందే. ఈసారి సమావేశాలకు అధ్యక్షత వహించే అవకాశం అమెరికాకు లభించింది. తొలుత ఈ సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడి విడిది అయిన క్యాంప్ డేవిడ్‌లో నిర్వహించాలనుకున్నారు. అయితే కరోనా మహమ్మారి ఈ ప్లాన్‌కు బ్రేకులు వేసింది. దీంతో జూన్‌లో వీడియో కాన్ఫరెస్స్ ద్వారా జీ7 సమ్మట్ నిర్వహించేందుకు అమెరికా నిర్ణయించినా.. ఇతర దేశాలకు భాగస్వామ్యం కల్పించే యోచనలో ఉన్న ట్రంప్.. దీన్ని సెప్టెంబర్ నెలకు వాయిదా వేశారని సమాచారం. 

Updated Date - 2020-05-31T15:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising