ఆన్‌లైన్ దిగ్గజాలకు ఫ్రాన్స్ భారీ జరిమానా
ABN, First Publish Date - 2020-12-11T09:32:59+05:30
నిబంధనలు ఉల్లంఘించాయంటూ గూగుల్, అమెజాన్‌లకు ఫ్రాన్స్ భారీ జరిమానా విధించింది. వినియోగదారుల డేటాను వారి అనుమతి లేకుండా ఆ సంస్థలు రికార్డు చేస్తున్నాయని
గూగుల్‌కు రూ.892కోట్లు..
అమెజాన్‌కు 309కోట్లు
ప్యారిస్: నిబంధనలు ఉల్లంఘించాయంటూ గూగుల్, అమెజాన్‌లకు ఫ్రాన్స్ భారీ జరిమానా విధించింది. వినియోగదారుల డేటాను వారి అనుమతి లేకుండా ఆ సంస్థలు రికార్డు చేస్తున్నాయని, వాటి ఆధారంగా ప్రకటనల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని ఫ్రాన్స్ డేటా భద్రత ఏజెన్సీ సీఎన్‌ఐఎల్ ఆరోపించింది. గత సెప్టెంబరులో చేసిన ఈ మార్పు లు ఫ్రాన్స్ నిబంధనలకు అనుగుణంగా లేవని తెలిపింది. అందువల్ల గూగుల్‌కు రూ.892 కోట్లు, అమెజాన్‌కు 309 కోట్ల జరిమానా విధించామని వెల్లడించిం ది. 3 నెలల్లో జరిమానా చెల్లించకుంటే మరో రూ.కోటి అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
Updated Date - 2020-12-11T09:32:59+05:30 IST