ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీసీఎస్‌లో నలభై వేల ఉద్యోగాలు...

ABN, First Publish Date - 2020-07-14T19:10:02+05:30

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) లో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. కరోనాతో ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితులనెదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో... నిరుద్యోగులకు హైటెక్ దిగ్గజం ఈ వార్తను చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం నలభై వేల మందికి కొత్తగా ఉద్యోగాలను కల్పించబోతున్నట్లు వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) లో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. కరోనాతో ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితులనెదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో... నిరుద్యోగులకు హైటెక్ దిగ్గజం ఈ వార్తను చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం నలభై వేల మందికి కొత్తగా ఉద్యోగాలను కల్పించబోతున్నట్లు వెల్లడించింది.


అయితే... ఈ నియామకాలు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉంటాయని తెలిపింది. టీసీఎస్‌ ప్రతినిధులు చెప్పిన వివరాల ప్రకారం... కరోనా నేపధ్యంలో... గత త్రైమాసికంలో సంస్థ ఆదాయం తగ్గినప్పటికీ... సంస్థ మాత్రం తన నియామకాలను తగ్గించుకోబోదెు. ఇక అమెరికాలో  కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ పెంచాలని కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో కూడా రెండు వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. దీని వలన...  హెచ్1బీ, ఎల్ 1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని భావిస్తోంది. ఇంజనీర్లను మాత్రమే కాకుండా అమెరికాలో టాప్ 1 బి-స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్లను కూడా నియమించుకోనున్నట్లు టీసీఎస్ వివరించింది. కాగా... 2014 నుంచి టీసీఎస్ 20 వేల మందికి పైగా అమెరికన్లను నియమించుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-07-14T19:10:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising