యూపీ మాజీ సీఎంకు కరోనా
ABN, First Publish Date - 2020-09-15T01:24:37+05:30
యూపీ మాజీ సీఎంకు కరోనా
లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్దారించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సలహా మేరకు లక్నోలోని ఎస్జీపీజీఐ ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారని తన మనవడు, రాష్ట్ర మంత్రి సందీప్ సింగ్ చెప్పారు.
Updated Date - 2020-09-15T01:24:37+05:30 IST