ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైసల్మేర్ రాజవంశస్తుడు బ్రిజ్ రాజ్ సింగ్ కన్నుమూత

ABN, First Publish Date - 2020-12-29T19:41:50+05:30

ప్రముఖ జైసల్మేర్ రాజ వంశస్తుడు, మాజీ పాలకుడు మహారావల్ బ్రిజ్ రాజ్ సింగ్ కన్నుమూశారు. 52 ఏళ్ల ఆయన ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: ప్రముఖ రాజ కుటుంబం జైసల్మేర్ వంశస్తుడు మహారావల్ బ్రిజ్ రాజ్ సింగ్ కన్నుమూశారు. 52 ఏళ్ల ఆయన ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు.  గత కొద్ది వారాలుగా బ్రిజ్ రాజ్ సింగ్ కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నెల 15న తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ ఆయన చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు భార్య రాజేశ్వరి రాజ్య లక్ష్మి,  ఇద్దరు కుమారులు చైతన్య రాజ్ సింగ్ భాటి, జన్మేజయ రాజ్ సింగ్ భాటి ఉన్నారు.  రాజేశ్వర రాజ్యలక్ష్మి నేపాల్ రాజవంశానికి చెందినవారు. కాగా బ్రిజ్ రాజ్ మరణవార్త తెలియగానే జైసల్మేర్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. రాజకుటుంబం ప్రస్తుతం నివసిస్తున్న సోనార్ ఖిల్లా వద్ద జెండాను అవనతం చేశారు. 

Updated Date - 2020-12-29T19:41:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising