ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జార్ఖండ్ మాజీ సీఎం బాబులాల్ మరాండీకి కరోనా

ABN, First Publish Date - 2020-09-26T16:30:47+05:30

జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీకి కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ (జార్ఖండ్): జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీకి కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైంది. జార్ఖండ్ బీజేపీ శాసనసభా పక్ష నేత అయిన మరాండీకి కరోనా లక్షణాలు కనిపించడంతో అతనికి కరోనా పరీక్షలు చేశారు. ‘‘నాకు కరోనా పాజిటివ్ అని వచ్చిందని, గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను’’ అంటూ బాబులాల్ మరాండీ ట్వీట్ చేశారు. ‘‘మీ అందరి ఆశీర్వాదాలతో త్వరలోనే నేను కరోనాను జయించి ప్రజాసేవలో నిమగ్నమవుతాను’’ అని బాబులాల్ పేర్కొన్నారు.


 మరాండీ ఢిల్లీ పర్యటన నుంచి తిరిగివచ్చాక దుంకా ప్రాంతంలో నాలుగురోజులపాటు పర్యటించాల్సి ఉండగా కరోనా సోకిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరోజ్ సింగ్ చెప్పారు. రాంచీలోని తన స్వగృహంలో హోంక్వారంటైన్ లోకి మరాండీ వెళ్లడంతో పర్యటనను రద్దు చేశామని సరోజ్ సింగ్ వివరించారు. 

Updated Date - 2020-09-26T16:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising