ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవే కాపీ కొడుతున్నారనుకున్నాం.. కానీ: మోదీపై సిద్ధరామయ్య సెటైర్!

ABN, First Publish Date - 2020-08-10T22:04:35+05:30

వ్యవసాయ రంగం కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్యాకేజీపై కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: వ్యవసాయ రంగం కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్యాకేజీపై కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంతకు ముందు ప్రకటించిన పథకాన్నే కేంద్ర ప్రభుత్వం మళ్లీ గొప్పగా ప్రకటించిందంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ ట్విటర్ వేదికగా సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘‘ఈ ఏడాది మేలో ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ మౌలిక సదుపాయాల పథకాన్ని ప్రకటించారు. ఇప్పుడు మన... నరేంద్ర మోదీ దాన్నే మళ్లీ ప్రకటించారు. ఇప్పటిదాకా యూపీఏ ప్రభుత్వ పథకాలనే పేరుమార్చి చెబుతున్నారనుకున్నాం.. కానీ ఇప్పుడు వాళ్ల పథకాలను వాళ్లే పునఃప్రకటన చేస్తున్నారు...’’ అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం ప్రకటించిన రూ. లక్ష కోట్ల ప్యాకేజీని ఉటంకిస్తూ సిద్ధరామయ్య ఈ మేరకు వ్యాఖ్యానించారు. కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప చెప్పినదాని ప్రకారం.. పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్రంలో 52.50 లక్షలమంది రైతులకు లబ్ధి చేకూరింది. తొలి విడతగా రూ. 1,049 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. 



Updated Date - 2020-08-10T22:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising