బొగ్గుగనుల వేలంపై ఆసక్తి చూపని విదేశీ సంస్థలు .. 40 శాతం గనులకు నో బిడ్డింగ్
ABN, First Publish Date - 2020-10-02T02:05:20+05:30
దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రకటించిన ‘వేలం’ ప్రక్రియలో పాల్గొనేందుకు విదేశీ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో... వేలం వేయనున్న 38 బొగ్గు గనుల్లో... 15 గనులకు ఒక్క బిడ్డు కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. పెట్టుబడిదారులు ఆసక్తి చూపకపోవడాన్ని అటుంచితే... విదేశీ సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు .
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రకటించిన ‘వేలం’ ప్రక్రియలో పాల్గొనేందుకు విదేశీ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో... వేలం వేయనున్న 38 బొగ్గు గనుల్లో... 15 గనులకు ఒక్క బిడ్డు కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. పెట్టుబడిదారులు ఆసక్తి చూపకపోవడాన్ని అటుంచితే... విదేశీ సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు .
భారతదేశంలో బొగ్గు ఉత్పత్తిని ఎక్కువగా కోల్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తోంది. కాగా... 23 బొగ్గు గనులకు మొత్తం 76 బిడ్లు మాత్రమే దాఖలు కాగా, మరో 15 గనులకు ఒక్క బిడ్డు కూడా దాఖలు కాలేదు.
బొగ్గు తవ్వకాలలో తక్కువ లేదా అనుభవం లేని కంపెనీలైన న్యూఢిల్లీకి చెందిన ఎన్డి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, బన్సాల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రిఫ్రిజెరాంట్ గ్యాస్ రీఫిల్లర్ రెఫెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా సాంకేతిక బిడ్లను సమర్పించాయి. విదేశీ సంస్థలు భారతీయ బొగ్గు గని వేలంపాట ప్రక్రియ నుంచి విరమించుకున్నట్టు వినవస్తోంది.
Updated Date - 2020-10-02T02:05:20+05:30 IST