ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగాలు పోయి, తిరిగివచ్చిన ఐటీ ప్రొఫెషనల్స్‌కు... అక్కడ

ABN, First Publish Date - 2020-09-24T00:17:27+05:30

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో... ఐటీ రంగంపై పరోక్ష ప్రభావం కూడా పడింది. అయితే... కాస్తోకూస్తో తక్కువ ప్రభావం పడింది మాత్రం దాదాపు ఈ రంగం పైనే. కాగా... ఇలా ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ రంగం వారికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒకింత ఊరట కల్పించింది. కర్మోభూమి పథకం ద్వారా వారికి ఉపాధి కల్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కత : కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో... ఐటీ రంగంపై పరోక్ష ప్రభావం కూడా పడింది. అయితే... కాస్తోకూస్తో తక్కువ ప్రభావం పడింది మాత్రం దాదాపు ఈ రంగం పైనే. కాగా... ఇలా ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ రంగం వారికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒకింత ఊరట కల్పించింది. కర్మోభూమి పథకం ద్వారా వారికి ఉపాధి కల్పించింది.


కాగా... ఈ పథకం కింద... ఉపాధి కోసం 37 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖమంత్రి అమిత్ వివరాలను వెల్లడించారు. ఇదిలా ఉండగా... బెంగాల్‌లో ఐటీ రంగ అభివృద్ధికి సిలిగిరి, కల్యాణి, దుర్గాపూర్ వంటి ప్రాంతాల్లో 17 ఐటీ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ద్వితీయ, తృతీయ నగరాలలో ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలని సీఐఐ(కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్)ను కోరామన్నారు.


సిలికాన్ వ్యాలీలో 20 ఎకరాల భూమిని భారతీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు కేటాయించామన్నారు. టీసీఎస్ కార్యాలయ ఏర్పాటుతో బెంగాల్‌లో చాలామంది ఆశావహులకు ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. మరో ఐదు ఐటీ పార్కులు... కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి ఇతర ప్రాంతాల నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారికి సహకరించేందుకు కర్మోభూమి పథకాన్ని ప్రారంభించినట్లు అమిత్ తెలిపారు.


ఇది స్కిల్డ్ ఉద్యోగుల వేదిక అన్నారు. జూన్ 8 వ తేదీన దీనిని ప్రారంభించగా, 37 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో... 24 వేల మందిదరఖాస్తులు ప్రాసెస్ అయినట్లు తెలిపారు. చిన్న పట్టణాలు, నగరాలు గతంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఈ క్రమంలోనే... చేయబడ్డాయని, కాబట్టి సిలిగురి, కల్యాణి, దుర్గాపూర్ వంటి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు ఐటీ పార్కులను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. 


Updated Date - 2020-09-24T00:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising