ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందంగా కనిపించాలని... చెవులు తీసేయించుకున్నాడు

ABN, First Publish Date - 2020-08-28T18:59:07+05:30

రీరం అందంగా కనిపించేందుకు ఏదో చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం సహజం. ప్రత్యేకించి... నటీనటులు ఈ పని చేస్తుంటారు. అయితే జర్మనీకి చెందిన 39 ఏళ్ల శాండ్రోకు… తన శరీరంలో వినూత్న మార్పులు చేసుకోవటం అంటే పిచ్చి. అతని రూపంలో అలాంటి మార్పుల పదిహేడు సార్లు చేయించుకున్నాడు. ఇందు కోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెర్లిన్ : శరీరం అందంగా కనిపించేందుకు ఏదో చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం సహజం. ప్రత్యేకించి... నటీనటులు ఈ పని చేస్తుంటారు. అయితే జర్మనీకి చెందిన 39 ఏళ్ల శాండ్రోకు… తన శరీరంలో వినూత్న మార్పులు చేసుకోవడమంటే పిచ్చి. అతని రూపంలో అలాంటి మార్పులను పదిహేడు సార్లు చేయించుకున్నాడు. ఇందు కోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టాడు.


శాండ్రోకి ఈ విషయంలో ఉన్న వ్యామోహం ఎంత తీవ్రమైనదంటే... తల కేవలం పుర్రెలా గుండ్రంగా కనిపించాలనే కోరికతో ఆపరేషన్ చేయించుకుని చెవులు తీయించేసుకున్నాడు. 2019లో ఈ ఆపరేషన్ చేయించుకుని చెవులను ఒక జార్ లో వేసి పెట్టుకున్నాడు. అందుకే ఇతడిని ‘మిస్టర్ స్కల్ ఫేస్’ అని పిలుస్తుంటారు.


శాండ్రోకి మొదట టాటూలు అంటే చాలా ఇష్టముండేది. తరువాతి కాలంలో శరీరంలో కొన్ని భాగాల్లో ప్రత్యేక అమరికలు చేయించుకోవడం మొదలుపెట్టాడు. అలా అతని తలపైన, చేతులపైన ఇంప్లాంట్స్ కనబడుతుంటాయి. శాండ్రోని చూసినవారు క్రేజీ అని, అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అంటుంటారు. కానీ శాండ్రో మాత్రం తన రూపం తనలో మరింత ఆత్మ విశ్వాసం పెంచుతోందంటూ సంబంరపడుతున్నాడు. 


జనం తన వంక అదే పనిగా చూసినా, విమర్శించినా పట్టించుకోనని, తన మనసుకు బాగా నచ్చినందువల్లే అలా చేయించుకున్నానని, దీనివలన తన ఆత్మ విశ్వాసం మరింతగా పెరిగిందని శాండ్రో చెబుతున్నాడు.


అయితే శాండ్రో విపరీత ధోరణి అతని జీవితంపైన మాత్రం తీవ్రమైన ప్రభావం చూపించింది. అతని ఉద్యోగం పోయింది. భార్య వదిలి వెళ్లిపోయింది. అయితే... వీటివల్ల అతనిలో మార్పు రాలేదు. ఇక ముందు కూడా శరీరంలో కొన్ని కొత్త మార్పులు చేయించుకునే ఉత్సాహంలో ఉన్నానంటున్నాడు శాండ్రో. నిజంగా... ఇది విపరీత ధోరణే కదూ. 

Updated Date - 2020-08-28T18:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising