ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహారోత్పత్తుల ధరలు పైపైకి...

ABN, First Publish Date - 2020-09-15T01:28:28+05:30

నాలుగు నెలల ప్రతికూలత అనంతరం దేశంలో టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్భణం ఆగస్ట్‌లో 0.16 శాతం మేర పెరిగింది. నెలవారీ డబ్ల్యుపీఐ ఆధారంగా వార్షిక ద్రవ్యోల్భణ రేటు 2020 ఆగస్ట్ కంటే... కిందటి సంవత్సరం ఆగస్ట్ లో 0.16 శాతం పెరిగినట్లు వెల్లడైంది. అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో 1.17 శాతంగా ఉందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : నాలుగు నెలల ప్రతికూలత అనంతరం దేశంలో టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్భణం ఆగస్ట్‌లో 0.16 శాతం మేర పెరిగింది. నెలవారీ డబ్ల్యుపీఐ ఆధారంగా వార్షిక ద్రవ్యోల్భణ రేటు 2020 ఆగస్ట్ కంటే... కిందటి సంవత్సరం ఆగస్ట్ లో 0.16 శాతం పెరిగినట్లు వెల్లడైంది. అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో 1.17 శాతంగా ఉందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


డబ్ల్యూపీఐ ద్రవ్యోల్భణం ఏప్రిల్ లో మైనస్ 1.57 శాతం, మే నెలలో మైనస్ 3.37 శాతం, జూన్ నెలలో మైనస్ 1.81 శాతం, జూలై నెలలో మైనస్ 0.58 శాతంగా నమోదైంది. ఫ్యూయల్, పవర్ ద్రవ్యోల్భణం ఆగస్ట్ నెలలో 9.68 శాతం మేర పడిపోయింది. అంతకుముందు నెలలో ఇది 9.84 శాతంగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ద్రవ్యోల్భణం 1.27 శాతంగా ఉంది. జూలై నెలలో ఇది 0.51 శాతంగా ఉంది. ఫుడ్ ఇండెక్స్ ద్రవ్యోల్భణం 4.07 శాతంగా ఉంది. 


ఆహారోత్పత్తులు, ఔషధాలు, సిమెంట్, ప్రాథమిక లోహాలతో సహా పదిహేడు రంగాల్లోని మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తుల్లోని పదింటి ఇండెక్స్ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాక్ డౌన్ అనంతరం ధరలు పెరిగినట్లు సోమవారం నాటి సూచీ వెల్లడించింది. ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్భణం ఆగస్ట్ నెలలో 3.84 శాతంగా ఉంది. బంగాళాదుంప ధరలు 82.93 శాతం మేరపెరిగాయి. కూరగాయల ద్రవ్యోల్భణం 7.03 శాతంగా ఉంది. ఉల్లి ద్రవ్యోల్భణం మైనస్ 34.48 శాతంగా ఉంది. మొత్తంమీద ఆహారత్పత్తుల ధరలు రానున్న రోజుల్లో మరింత పైపైకి ఎగబాకే సూచనలు కనిపిస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-09-15T01:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising