ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు జిల్లాల్లో 144 సెక్షన్

ABN, First Publish Date - 2020-03-24T18:47:24+05:30

కరోనా వైరస్‌ను నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేరళలోని ఐదు జిల్లాల్లో సెక్షన్ 144 అమల్లోకి తెచ్చారు. కాసర్ గాడ్, కోడికోడ్, వయనాడ్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కరోనా వైరస్‌ను నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేరళలోని ఐదు జిల్లాల్లో సెక్షన్ 144 అమల్లోకి తెచ్చారు. కాసర్ గాడ్, కోడికోడ్, వయనాడ్, మలప్పుపురం, ఎర్నాకులం జిల్లాల్లో ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఐదు, అంతకుమించి వ్యక్తులు ఒకచోటు గుమిగూడరాదని, పెద్ద సంఖ్యలో జనం గుమిగూడకుంటా నిరోధించేందుకు ఇతర జిల్లాల్లోనూ నిషేధ ఉత్తర్వులు అమలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


కేరళలో ఇంతవరకూ 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కాసర్‌గాడ్ అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ప్రజలు అకారణంగా ఇళ్లలోంచి బయటకు వస్తే అరెస్టులు కూడా చేయాల్సి వచ్చిందని కాసర్‌గాడ్ జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రవాసభారతీయులు అధికారులకు సహకరించకున్నా, హోం క్వారంటైన్‌ను చర్యలను ఉల్లంఘించినా వారి పాస్‌పోర్టులు సీజ్ చేస్తామని ఆయన చెప్పారు.


Updated Date - 2020-03-24T18:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising