ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగాలు కోల్పోయిన వారి గణాంకాలు కోరిన ఆర్థిక శాఖ

ABN, First Publish Date - 2020-05-29T20:37:38+05:30

కోవిడ్ సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి గణాంకాలు సేకరించాలని కార్మిక శాఖను కేంద్ర ఆర్థిక శాఖ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి గణాంకాలు సేకరించాలని కార్మిక శాఖను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. కోల్పోయిన ఉద్యోగాలు, వేతన కోతలపై కార్మిక మంత్రిత్వ శాఖతో ఆర్థిక శాఖ మంతనాలు జరిపిందని, గణాంకాలు అందించాలని కోరిందని ఆర్థిక శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. దీనికితోడు, ప్రభుత్వ రంగ బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు, పంపిణీ చేసిన రుణాల మధ్య పొంతన లేకపోవడాన్ని కూడా ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. పోర్ట్‌ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ (ఎఫ్‌పీఐ) రూటులో చైనాపై ఆంక్షలపై కూడా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లో మార్చి 23న అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను విడతల వారిగా పొడిగిస్తూ రాగా, నాలుగో విడత లాక్‌డౌన్ మే 31తో ముగియనుంది.

Updated Date - 2020-05-29T20:37:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising