ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహ్వానం అందకపోవడంపై కన్నీళ్లు పెట్టుకున్నా : మమత బెనర్జీ

ABN, First Publish Date - 2020-02-14T21:21:46+05:30

ఈ విషయంలో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. తాను రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కత్తా : ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవానికి తనను కేంద్రం ఆహ్వానించకపోవడంపై తాను చాలా బాధపడ్డానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ విషయంలో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. తాను రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపానని, దీని కోసం చాలా కష్టపడ్డానని, అలాంటిది ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రం ఆహ్వానించకపోవడం విడ్డూరమని వాపోయారు. ‘‘నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నా. కనీసం నాకు సమాచారం అందివ్వకుండానే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసేశారు’’ అని వాపోయారు. ఈస్ట్- కోస్ట్ రైల్వే కారిడార్‌ను గురువారం కేంద్ర రైల్వే మంత్రి పీయూశ్ గోయల్ ప్రారంభించారు. అయితే ఆహ్వాన పత్రికలో మాత్రం టీఎంసీ నాయకుల పేర్లు ఎక్కడా ప్రచురించక పోవడంతో తృణమూల్ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 

Updated Date - 2020-02-14T21:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising