ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇజ్రాయెల్‌లో ‘నిర్భయ’ ఘటన

ABN, First Publish Date - 2020-08-22T08:23:47+05:30

వాషింగ్టన్‌, ఆగస్టు 21 : ఇజ్రాయెల్‌లో అమానుషం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న పదహారేళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్యం మత్తులో ఉన్న బాలికపై 30 మంది గ్యాంగ్‌రేప్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 21 : ఇజ్రాయెల్‌లో అమానుషం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న పదహారేళ్ల బాలికపై 30 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐలట్‌ పట్టణంలోని రెడ్‌ సీ హోటల్‌లో బాలిక మద్యం మత్తులో ఉండగా వారు ఈ దారుణానికి తెగబడ్డారు.


వాస్తవానికి ఈ ఘటన వారం క్రితం చోటుచేసుకుంది. అయితే దీన్ని ఖండిస్తూ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, అధ్యక్షుడు ర్యూవెన్‌ రివ్లిన్‌లు తాజాగా ప్రకటనలు విడుదలచేయడంతో.. ఈ అమానుషం ప్రపంచం దృష్టికి వచ్చింది. ఇక ఇంతటి దారుణానికి తెగబడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి.


కాగా, సదరు మైనర్‌పై అత్యాచారం జరిపిన నిందితులంతా 30 ఏళ్లలోపు వారేనని గుర్తించారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్న పోలీసులు ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టుచేశారు. త్వరలోనే మిగతా వారందరినీ అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు నిలబెడతామని పోలీసులు ప్రకటించారు. 


Updated Date - 2020-08-22T08:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising