ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరాటంకంగా బియ్యం, గోధుమల సరఫరాకు ఎఫ్‌సీఐ చర్యలు

ABN, First Publish Date - 2020-04-02T13:24:37+05:30

దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో బియ్యం, గోధుమలను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిరాటంకంగా సరఫరా చేస్తుందని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో బియ్యం, గోధుమలను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిరాటంకంగా సరఫరా చేస్తుందని కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ‘‘లాక్ డౌన్ సందర్భంగా దేశంలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్దిదారులకు ఒక్కొక్కరికి 5కిలోల చొప్పున బియ్యం, గోధుమల పంపిణీకి భారత ఆహార సంస్థ సిద్ధంగా ఉంది. అవసరమైతే వచ్చే మూడు నెలలపాటు అదనంగా ఒక్కో వ్యక్తికి మరో ఐదు కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలను పంపిణీ చేస్తాం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 81.35 కోట్ల మంది ప్రజలకు బియ్యం , గోధుమలను పంపిణీ చేస్తాం’’ అని కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ పేర్కొంది.


మార్చి 31వతేదీ వరకు 56.75 మిలియన్ల మెట్రిక్ టన్నుల బియ్యం, గోధుమలను పంపిణీ చేశామని మంత్రిత్వశాఖ వివరించింది. 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు నిల్వ ఉన్నాయని, 352 రేక్స్ ద్వార 9.86 మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను తరలించామని మంత్రిత్వశాఖ వివరించింది. 

Updated Date - 2020-04-02T13:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising