ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌ను అనుమానించా..సారీ: అమెరికా అంటువ్యాధుల నిపుణుడు

ABN, First Publish Date - 2020-12-04T20:54:42+05:30

ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా టీకాకు బ్రిటన్‌లో అత్యవసర అనుమతులు జారీ అయిన విధానంపై అనుమానాలు వ్యక్తం చేసిందుకు క్షమించాలని అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు ఆంథొనీ ఫౌచీ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా టీకాకు బ్రిటన్‌లో అత్యవసర అనుమతులు జారీ అయిన విధానంపై అనుమానాలు వ్యక్తం చేసిందుకు క్షమించాలని అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు ఆంథొనీ ఫౌచీ కోరారు. బ్రిటన్ వ్యవస్థలు, అధికారుల పనితీరుపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బ్రిటన్‌లోని అనుమతుల జారీ విధానంపై పౌచీ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పైజర్ టీకాకు చెందిన క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా..తొందరపడి జెండా ఊపి టీకా విడుదల చేశారంటూ’ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలని బ్రిటన్ ఛానళ్లు ప్రముఖంగా ప్రసారం చేయడంతో బ్రిటన్‌లో కలకలం రేగింది. ఫౌచీపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన గురువారం నాడు క్షమాపణలు చెప్పారు. ‘ఇక్కడ చిన్న అపార్థం చోటుచేసుకుంది. అయితే..ఈ వ్యాఖ్యలు చేసినందుకు నేను చింతిస్తున్నా.. క్షమించండి. బ్రిటన్‌లోని శాస్త్రవేత్తలపై, అక్కడి ఔషధ నియంత్రణ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకముంది’ అని కామెంట్ చేశారు.   

Updated Date - 2020-12-04T20:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising