ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌కు ఓ తండ్రిలా సలహా ఇచ్చారు: పవార్ వ్యాఖ్యలపై ఎన్సీపీ

ABN, First Publish Date - 2020-12-06T02:42:15+05:30

రాహుల్‌ గాంధీని జాతీయ నేతగా అంగీకరించేందుకు దేశానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.. ఆయనకు స్థిరత్వం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి స్థిరత్వం లేదంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరాద్ పవార్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు శరాద్ పవార్ సదరు సమాధానం ఇచ్చారు. అయితే శరాద్ చేసిన వ్యాఖ్యల్నీ తప్పు పట్టాల్సిన అవసరం లేదని, ఓ తండ్రిలా రాహుల్‌కు సలహా ఇచ్చారని ఎన్సీపీ వివరణ ఇచ్చుకొచ్చింది.


‘‘ఇంటర్వ్యూలో శరాద్ పవార్ చెప్పిన విషయం.. రాహుల్‌కు ఓ తండ్రిలా సలహా ఇచ్చారు. మహారాష్ట్రలో మూడు పార్టీల కూటమి అధికారంలో ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీ ఒకటి. రాహుల్ గాంధీపై బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను పవార్ ఖండించారు. మన దేశ నాయకులపై బరాక్ ఒబామా కామెంట్ చేయాల్సిన అవసరం లేదని పవార్ తేల్చి చెప్పారు’’ అని ఎన్సీపీ నేత తపసీ అన్నారు.


‘‘రాహుల్‌ గాంధీని జాతీయ నేతగా అంగీకరించేందుకు దేశానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.. ఆయనకు స్థిరత్వం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ కుటుంబంతో నాకు విభేదాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ సభ్యులకు ఇప్పటికీ గాంధీ-నెహ్రూ కుటుంబం పట్ల అభిమానం ఉంది’’ అని ఓ ఇంటరవ్యూలో అడిగిన ప్రశ్నలకు శరాద్ పవార్ సమాధానం ఇచ్చారు. అయితే దీనిపై కాంగ్రెస్ వర్గీయుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2020-12-06T02:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising