విదేశీ తబ్లిఘీలపై కేసుల విచారణ వేగవంతం చేయండి: సుప్రీం
ABN, First Publish Date - 2020-11-03T07:28:45+05:30
వీసా ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి విదేశీ తబ్లిఘీ జమాత్ సభ్యులపై పెండింగులో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని ట్రయల్ కోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది...
న్యూఢిల్లీ, నవంబరు 2: వీసా ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి విదేశీ తబ్లిఘీ జమాత్ సభ్యులపై పెండింగులో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని ట్రయల్ కోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది. నిజాముద్దీన్ మర్కజ్ సమ్మేళనానికి హాజరైన తబ్లిఘీ జమాత్ సభ్యులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే విచారణను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను నవంబరు 20కి వాయిదా వేసింది.
Updated Date - 2020-11-03T07:28:45+05:30 IST