అవేమీ వద్దు, చట్టాలు రద్దు చేయండి: కేంద్రానికి తేల్చి చెప్పిన రైతులు
ABN, First Publish Date - 2020-12-02T00:47:57+05:30
ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న వేలాది మంది రైతుల్ని రాజధానిలోకి అనుమతించకపోవడంతో సరిహద్దులోనే నిరసనకు దిగారు. హర్యానా సరిహద్దులో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు, బారీకేడ్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన రైతులతో ఈరోజు కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, నరేంద్ర సింగ్ తోమర్ చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు సఫలం కాలేదనే చెప్పాలి. వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఈరోజు ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇదే ఎజెండాపై రైతులను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. అయితే చట్టాలు రద్దు చేయడం మినహా కేంద్రం ఇంకేం చెప్పినా వినేది లేదని రైతులు తేల్చి చెప్పారు. నిజానికి డిసెంబర్ 3న రైతులతో ప్రభుత్వం సమావేశం కావాల్సి ఉంది. అయితే దీనికి రెండు రోజుల ముందుగానే ఇద్దరు కేంద్ర మంత్రులు చర్చలు చేశారు.
ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న వేలాది మంది రైతుల్ని రాజధానిలోకి అనుమతించకపోవడంతో సరిహద్దులోనే నిరసనకు దిగారు. హర్యానా సరిహద్దులో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు, బారీకేడ్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాటన్నిటినీ చేధించుకుని రైదులు ఢిల్లీ సరిహద్దులోకి ప్రవేశించారు. కాగా, ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో నిరసనలు తెలియజేయడానికి రైతులకు ఢిల్లీ పోలీసులు అనుమతించారు. ఉత్తర ఢిల్లీలోని నిరంకారి మైదానంలో ఆందోళనను శాంతియుతంగా కొనసాగించాలని పోలీసులు కోరారు.
Updated Date - 2020-12-02T00:47:57+05:30 IST