ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు చెప్పింది కరెక్ట్.. చట్టం రద్దుచేయాలి: భూసార శాస్త్రవేత

ABN, First Publish Date - 2020-12-11T22:12:01+05:30

కొత్త కార్మిక చట్టాలు రైతుల ప్రయోజనాలను కాపాడవని, వాటిని రద్దు చేయాలని పంజాబ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లూథియానా: కొత్త కార్మిక చట్టాలు రైతుల ప్రయోజనాలను కాపాడవని, వాటిని రద్దు చేయాలని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ (పీఏయూ)లో భూశాస్త్ర విభాగం ప్రధాన భూ శాస్త్రవేత్త డాక్టర్ వర్దీందర్‌ పాల్ సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డును సోమవారంనాడు ఆయన తిరస్కరించారు. ప్లాంట్ న్యూట్రీషియన్ రంగంలో చేసిన కృషికి గాను ఫెర్డిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆయనకు అవార్డు ప్రకటించింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకోవాల్సి ఉండగా, సింగ్ పేరు ప్రకటించగానే ఆయన స్టేజ్ మీదకు వచ్చి, తన అంతరాత్మ అంగీకరించనందునే అవార్డును తిరస్కరిస్తున్నట్టు సున్నితంగా నిరాకరించారు.


''రైతులు వాదన సరైనదేనని చెప్పి అవార్డును తిరిగి ఇచ్చేశాను. ఈ చట్టాలను రద్దు చేయాలి. ఇవి రైతుల ప్రయోజనాలను ఏమాత్రం కాపాడవు. ఒక్క పంజాబు రైతులే కాదు, దేశంలోని రైతులంతా నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఏ ఒక్కరూ వారి గోడు పట్టించుకోవడం లేదు. పైగా టెర్రరిస్టులు వస్తున్నారంటూ సంబోధిస్తున్నారు. వాళ్లు టెర్రరిస్టులు కాదు, రైతులు'' అని సింగ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


నా తల్లి పరిహసించింది...

''మేథావులంతా అవార్డులు తిరిగి ఇచ్చేస్తుంటే, నువ్వు అవార్డు అందుకునేందుకు వెళ్లడం మంచిది కాదు'' అని తలి తల్లి పరిహసించినట్టు సింగ్ చెప్పారు. కాగా, ఆరు విడతలుగా రైతు ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. సవరణలకు కేంద్ర చేసిన ప్రతిపాదనను రైతు సంఘాలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. చట్టాల రద్దు అంశంపై చర్చ జరగాలనేది కేంద్ర ప్రతిపాదనాంశాలలో ఉండాలని రైతు సంఘాలు చేసిన డిమాండ్‌ను కేంద్రం బేఖాతరు చేసింది. దీంతో తమ ఆందోళనను ఉధృతం చేస్తామంటూ రైతు సంఘాలు ప్రకటించాయి.

Updated Date - 2020-12-11T22:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising