ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

’రైతుల మరణ శాసనంపై సంతకం చేయడమే’ అంటూ కేంద్రంపై విపక్షాల ధ్వజం

ABN, First Publish Date - 2020-09-20T17:05:39+05:30

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు ఎంతో చారిత్రాత్మకమైనవని, రైతు జీవన శైలిలో చాలా మార్పులు తెస్తాయని ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని రైతులందరూ అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఈ బిల్లులపై చర్చ సందర్భంగా విపక్షాలు అధికార పక్షంపై తీవ్రంగా మండిపడ్డాయి.

డెరేక్ ఓ బ్రెయిన్ (తృణమూల్)

‘‘రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మీరేమో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2028 నాటికి గానీ రైతుల ఆదాయం రెట్టింపు కాదు. ఇలాంటి వాగ్దానాలపై ప్రజల్లో విశ్వసనీయత లేదు. మీ ప్రకటించిన రెండు కోట్ల ఉద్యోగాలేవీ? నాలుగు నిబంధనల్లో కనీస మద్దతు ధర అనేది ఓ అంశం మాత్రమే. మేము ఆ నాలుగు అంశాలనూ వ్యతిరేకిస్తున్నాం. కేవలం కనీస మద్దతు ధరను మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్న ప్రచారాన్ని చేయకండి’’.

టీకేఎస్ ఇళంగోవన్ (డీఎంకే)

ఈ బిల్లులు రైతులను బానిసలుగా మారుస్తాయి. కార్పొరేట్ శక్తులకు రైతులు బానిసలవుతారు. జీడీపీలో రైతుల భాగస్వామ్యం 20 శాతం. ఈ బిల్లులు రైతుల ఉసురు  తీసుకునేవి. రైతులను ఆట వస్తువులుగా మార్చేస్తాయి’’.

రాం గోపాల్ యాదవ్ (సమాజ్ వాదీ)

‘‘కేంద్రం వైఖరి చూస్తుంటే ఈ బిల్లులపై ఎలాంటి చర్చ చేపట్టకూడదన్నట్లుంది. కేవలం పరుగో పరుగు అన్నట్లుంది. ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో కనీసం రైతు నేతలతో, ప్రతిపక్షాలతో చర్చించలేదు. కనీసంలో కనీసం ఆరెస్సెస్ అనుబంధ రైతు సంఘంతోనూ సంప్రదించలేదు. గత ఆరు సంవత్సరాలలో జీడీపీలో వ్యవసాయ సహకారం 6 శాతం ఎందుకు తగ్గిపోయింది? ఆలోచించారా?’’

ప్రతాప్ సింహ బాజ్వా (కాంగ్రెస్)

‘‘మేము ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం. తమ జీవితాలపై దాడి చేయడానికే కేంద్రం ఈ బిల్లులను తెచ్చిందని పంజాబ్, హర్యానా రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లును ఆమోదించడమంటే రైతుల మరణ శాసనంపై సంతకం చేయడం లాంటిదే.’’ 

నరేశ్ కుమార్ గుజ్రాల్ (శిరోమనీ అకాలీదళ్)

‘‘ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలి. దీంతో అన్ని పక్షాల వారూ దీన్ని వినవచ్చు. పంజాబ్ రైతులు బలహీనులని భావించకండి.’’


Updated Date - 2020-09-20T17:05:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising