ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌పై డబ్ల్యూహెచ్ఓ పేరిట వెలువడిన వైరల్ మెసేజ్ ఫేక్

ABN, First Publish Date - 2020-04-06T14:57:44+05:30

భారతదేశంలో దశలవారీగా కరోనా లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ)పేరిట వాట్పాప్‌లో వైరల్ అవుతున్న మెసేజ్ నకిలీదని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారతదేశంలో దశలవారీగా కరోనా లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ)పేరిట వాట్పాప్‌లో వైరల్ అవుతున్న మెసేజ్ నకిలీదని తేలింది. దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ముందుగా మార్చి 22వతేదీన ఒకరోజు ట్రయల్ లాక్‌డౌన్ విధించారని, అనంతరం మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు మొదటిదశ లాక్‌డౌన్ విధించారని, మళ్లీ ఏప్రిల్ 15 నుంచి 19 వరకు లాక్‌డౌన్ ను ఎత్తివేసి, అనంతరం ఏప్రిల్ 20 నుంచి మే 18 వరకు రెండే విడత లాక్‌డౌన్ విధిస్తారని, మళ్లీ మే 19 నుంచి మే 24 వరకు ఎత్తివేసి అనంతరం తుదిదశ లాక్‌డౌన్ మే 25 నుంచి జూన్ 10వరకు 15రోజులు విధిస్తారని, దీనికి ప్రజలు మానసికంగా సిద్ధంగా ఉండాలని కోరుతూ డబ్ల్యూహెచ్ఓ పేరిట వాట్సాప్ లో మెసేజ్ వైరల్ అవుతోంది.


కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక వెబ్ సైట్ ను పరిశీలిస్తే అలాంటి ప్రకటన ఏదీ లేదని తేలింది. భారతదేశానికి కాని, ఏ ఇతర దేశానికి డబ్ల్యూహెచ్ఓ లాక్ డౌన్ విధింపుపై ఇలాంటి ప్రకటనలు చేయదని స్పష్టమైంది. దశలవారీగా లాక్‌డౌన్ అంటూ వచ్చిన మెసేజ్ నకిలీదని వెల్లడైంది. దేశంలో కరోనా లాక్‌డౌన్ పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గూబా ప్రకటించారు.ఇలాంటి తప్పుడు మెసేజ్ లు నమ్మవద్దని కేంద్ర అధికారులు ప్రజలను కోరారు.

Updated Date - 2020-04-06T14:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising