ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరు మారింది.. కొత్త పేరు ఏంటంటే..

ABN, First Publish Date - 2020-07-03T01:47:33+05:30

హిందుస్థాన్ యూనిలివర్ ఉత్పత్తుల్లో ఒకటైన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ నేమ్ విషయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందుస్థాన్ యూనిలివర్ ఉత్పత్తుల్లో ఒకటైన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ నేమ్ విషయంలో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ నేమ్ నుంచి ‘ఫెయిర్’ అనే పదాన్ని తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ ఆ ఉత్పత్తికి సంబంధించిన కొత్త పేరును గురువారం ప్రకటించింది. ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరును ‘గ్లో అండ్ లవ్లీ’గా మార్చినట్లు తెలిపింది. ఇకపై.. ఇదే పేరుతో అమ్మకాలు జరుగుతాయని స్పష్టం చేసింది.


అమెరికాలో ‘బ్లాక్ లివ్స్ మేటర్’ ఊపందుకున్న ఈ సందర్భంలో ‘ఫెయిర్’ అనే పదాన్ని వినియోగించి తమ ఉత్పత్తులను విక్రయించడం సరికాదని ఈ సంస్థ అభిప్రాయపడింది. ‘ఫెయిర్’, ‘వైట్’, ‘లైట్’ పదాలు అందానికి ఏకపక్ష నిర్వచనాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని, ఇది సమంజసం కాదని అనిపించే.. తాము ఈ పదాలను తొలగించాలని నిర్ణయించినట్లు యూనిలివర్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ డివిజన్ ప్రెసిడెంట్ సన్నీ జైన్ తెలిపారు. 


అమెరికాలో నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ అనే వ్యక్తి.. మే 25న డెరెక్ చావిన్ అనే పోలీసు అధికారి కారణంగా ఊపిరి ఆడక మరణించాడు. నల్లజాతీయుల వివక్ష విషయంలో నిరసనజ్వాలలు మిన్నంటడంతో ఇటీవల ‘బ్లాక్ లివ్స్ మేటర్’ ఉద్యమానికి మద్దతుగా జాన్సన్ అండ్ జాన్సన్ కూడా భారత్‌లో విక్రయించే రెండు ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దక్షిణాసియాలో ఫెయిర్‌నెస్ క్రీమ్స్‌లో ఫెయిర్ అండ్ లవ్లీదే ఇప్పటివరకూ పైచేయి. మరి కొత్త పేరుతో.. ‘గ్లో అండ్ లవ్లీ’గా త్వరలో మార్కెట్‌లో రాబోతున్న ఈ ఫేస్ క్రీమ్ గతంలో మాదిరిగానే అమ్మకాల్లో హవా సాగిస్తుందో లేదో చూడాలి.

Updated Date - 2020-07-03T01:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising