ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ వ్యాఖ్యలను చూస్తూ కూడా ఊరుకుంటారా? సీఈఓకు ఫేస్‌బుక్ ఉద్యోగుల సూటి ప్రశ్న!

ABN, First Publish Date - 2020-06-03T18:33:33+05:30

హింసను ప్రేరేపించేలా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫేస్‌బుక్ పోస్టుల విషయంలో సంస్థ యాజమాన్యం ఉదాసీనంగా ఉండటం పట్ల ఫేస్‌బుక్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: హింసను ప్రేరేపించేలా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫేస్‌బుక్ పోస్టుల విషయంలో సంస్థ యాజమాన్యం ఉదాసీనంగా ఉండటం పట్ల ఫేస్‌బుక్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులతో సంస్థ సీఈఓ మార్క్‌జూకర్‌బర్గ్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో మార్క్‌ను వారు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపాలనే అర్థం వచ్చేలా ట్రంప్ పెట్టిన పోస్టు ఇప్పటికీ ఫేస్‌బుక్‌లో ఉండటం పట్ల అనేక మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ నిబంధనల ప్రకారం ఆ పోస్టు హింసను ప్రేరేపించేలా ఉందని నిరూపించలేక పోతున్నామని మార్క్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే.. వాటిని పూర్తిగా తొలగించే బదులు ఇతర మార్గాల్లో వినియోగదారులను హెచ్చరించేందుకు మార్గాలను అన్వేషించాలని మార్క్ అభిప్రాయపడ్డారట. ఇటువంటి పోస్టుల విషయంలో సంస్థ అనుసరిస్తున్న విధానంలో మార్పులు తీసుకొచ్చే విషయాన్నికూడా పరిశీలిస్తున్నట్టు మార్క్ తెలిపారట. అయితే 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశం.. ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించలేకపోయిందని తెలిసింది.

Updated Date - 2020-06-03T18:33:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising